RRR నుంచి తప్పుకున్న అలియా భట్‌

RRR నుంచి తప్పుకున్న అలియా భట్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి రేపుతున్న RRR మూవీ హీరోయిన్లలో ఒకరైన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మూవీ కోసం భారీ మొత్తం పారితోషికం అందుకున్న అలియా ఎందుకు సినిమా నుంచి వైదొలిగారనేది ఆసక్తికరంగా మారింది. డేట్లను సర్దుబాటు చేయలేకే గల్లీ బాయ్‌ నటి రాజమౌళి మూవీ నుంచి వైదొలిగనట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక మే షెడ్యూల్‌ కోసం అలియా భట్‌ మేనేజర్‌తో రాజమౌళి బృందం సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. సడక్‌ 2, బ్రహ్మాస్త్ర, సంజయ్‌ లీలా భన్సాలీ ప్రాజెక్ట్‌ వంటి పలు సినిమాలతో ఆమె ఊపిరిసలపని బిజీలో ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో డేట్లు కేటాయించలేని స్ధితిలో ఆమె రాజమౌళి ప్రాజెక్టును వదులుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ వార్తలను నిర్మాత ధ్రువీకరించకపోయినా పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి.