పెళ్లి సందడి హీరోయిన్ దీప్తి ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

గుర్తుపట్టనంతగా మారిపోయిన దీప్తి భట్నాకర్
దీప్తి భట్నాకర్

హీరో శ్రీకాంత్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాలలో పెళ్లి సందడి ఒకటి. ఈ సినిమా కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా 1990లో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పెళ్లి సందడి ఇప్పటికీ టీవీలో వస్తే చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇకపొతే ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా రవళి మరియు దీప్తి భట్నాకర్ కనిపించారు.

ఈ సినిమాతోనే దీప్తి తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఏ సినిమా మొదటి సినిమ ఐనా దీప్తి తన నటనతో చాలామంది అభిమానులను, గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత దీప్తి భట్నాకర్ కి వరుస ఆఫర్ లు వచాయి .. ఇండస్ట్రీకి దూరం అయిన హీరోయిన్ దీప్తి వివరాలు ప్రస్తుతం ప్రేక్షకులకు తెలియదు.వరుస సినిమాలు చేసిన దీప్తి 2002లో వచ్చిన కొండవీటి సింహాసనం సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించలేదు. ప్రస్తుతం దీప్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా 2007లో రాఖీల్ పట్టు అనే మలయాళ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది.

గుర్తుపట్టనంతగా మారిపోయిన దీప్తి భట్నాకర్
దీప్తి భట్నాకర్

కేవలం నటించడమే కాకుండా దీప్తి నిర్మాతగా కూడా మారింది. దీప్తి భట్నాకర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ద్వారా అనేక టీవీ షోలను నిర్మించింది. ఇక ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా టీవీ షోలను నిర్మిస్తోంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ దీప్తి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక పెళ్లి సందడి సినిమాలో ఎంతో అందంగా కనిపించిన దీప్తి ప్రస్తుతం చూడ్డానికి కాస్త బొద్దుగా మారిపోయింది. దాంతో గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది.