ఏపి ప్రజలు 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారు: BJP

People of AP are drowning in 10 lakh crore debt: BJP
People of AP are drowning in 10 lakh crore debt: BJP

ఏపి ప్రజలు 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారని..ఆంధ్రప్రదేశ్ లో అప్పులు తప్ప అభివృద్ధి లేదని ఏపి బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తిరుపతి కార్పోరేషన్ కు టీటీడీ సొమ్మును బదలాయించడం సమంజసం కాదని.. రూ. 4,600 కోట్ల వార్షిక బడ్జెట్ లో 1 శాతం నిధులను, “పరిశుభ్రత” పేరుతో మరో రూ. 50 కోట్ల నిధులను తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని విమర్శలు చేశారు.

రూ. 100 కోట్లను అభివృద్ధి పేరుతో తిరుపతి కార్పోరేషన్ కు తరలించి, కమీషన్ల పేరుతో జేబులు నింపుకుంటున్నారని ఏపి బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తన రాజకీయ లబ్ది కోసం టీటీడీ నిధులను టీటీడీ ఛైర్మన్ ఖర్చు పెడుతున్నారని..తన కుమారుడిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండి పోటీ చేయించే ఆలోచనలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారన్నారు. తిరుమల-తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరు భావించరాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుందా..!? అని ఏపి బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి నిలదీశారు.