తనూశ్రీకి పోలీసు భద్రత…!

Police Security For Tanushree Dutta

బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ తనూశ్రీ దత్త గత కొన్ని రోజులుగా పలువురు స్టార్స్‌ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపుతున్న విషయం తెల్సిందే. నానా పటేకర్‌పై ఈమె చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. భారీ ఎత్తున ఈమె గురించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆమెపై కొందరు దాడికి ప్రయత్నించిన విషయం తెల్సిందే. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తనూశ్రీ దత్తా సేఫ్‌గా బయట పడినది. అయితే ఈమెకు ఇంకా ప్రమాదం పొంచి ఉందనే ఉద్దేశ్యంతో పోలీసులు రక్షణ కల్పించాలని నిర్ణయించుకున్నారు.

thanusree-dutt

ఇటీవల ఈమె తనను రాజ్‌ థాకరే బెదిరించారు అంటూ ఆరోపించిన విషయం తెల్సిందే. శివసేన కార్యకర్తలు తనను చంపేందుకు కూడా సిద్దపడతారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులను ఆమె భద్రత నిమిత్తం పెట్టడం జరిగింది. ముంబై పోలీసులు ఆమెకు 24 గంటల రక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చారట. ఆ విషయాన్ని స్వయంగా తనూశ్రీ దత్తా చెప్పుకొచ్చింది. మొత్తానికి బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న తనూశ్రీ దత్తా ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది.

tanusree-dutt-sexual-harria