Political Updates: పార్లమెంట్ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం

Political Updates: Center's key decision on Parliament security
Political Updates: Center's key decision on Parliament security

పార్లమెంట్ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్ఎఫ్ ను కేటాయిస్తూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కొత్త, పాత పార్లమెంట్ భవనాలు సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తాయి.

సీఐఎస్ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీస్ దళంలో భాగంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలకు కాపలాగా ఉంటుంది. అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్ స్టాలేషన్ లను కూడా కాపాడుతోంది. పార్లమెంట్ భవన సముదాయాన్ని సర్వే చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. తద్వారా సీఐఎస్ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగాన్ని సమగ్ర నమూనాలో మోహరించడం సాధ్యం అవుతుందని వెల్లడించారు. డిసెంబర్ 13న పార్లమెంట్ లో అలజడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల సందర్భంగా నలుగురు దుండగులు లోక్ సభలోకి ప్రవేశించి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపడుతున్నాయి.