మరింత వేడెక్కిన ఏపీ వాతావరణం

మరింత వేడెక్కిన ఏపీ వాతావరణం

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పెద వెంకయ్య అనే టీడీపీ కార్యకర్త ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తారన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తమపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తన కొడుకు కోసం వచ్చి తనపై దాడి చేశారని వాపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది. అయితే.. ముందురోజు జరిగిన దాడికి సంబంధించిన బట్టలతో చంద్రబాబు కలవటం.. ఆ సందర్భంగా బాబు రియాక్షన్ లాంటివి చూసినప్పుడు.. ఇదంతా క్రమపద్దతిలో జరుగుతున్న వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార బలంతో దాడులు చేయటాన్ని ఖండించాల్సిందే. అయితే.. బాధితులన్నట్లుగా చెబుతూ వాదన వినిపిస్తున్న వేళ.. అవతలి వారి వాదనను కూడా వినాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే గొడవకు మూలం తెలుస్తుంది. అందుకు భిన్నంగా రక్తం మరకలతో నిండిన చొక్కాతో వచ్చి మీడియా కంట్లో పడేలా వ్యవహరించిన తీరు చూస్తే మాత్రం పలు సందేహాలు కలుగక మానదు.