విడాకులు తీసుకోవడం సినిమా వాళ్లకు ఫ్యాషన్ అయ్యిందా అనిపిస్తుంది గత కొన్నేళ్లుగా వారిని చూస్తుంటే. ఉదాహరణగా చెప్పుకోవాలంటే నాగార్జున, సుమంత్, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, ప్రభుదేవా, ప్రకాష్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, అమిర్ ఖాన్, బోనీ కపూర్, రాధిక, గౌతమి, మలైకా అరోరా ఇలా ఎన్నో పేర్లు. వీళ్ళని చూస్తుంటే సినిమా వాళ్ళు తమ పెళ్ళిళ్ళని కూడా సినిమా లాగే చూస్తారా అని అనిపించకమానదు.ఇక అసలు విషయానికి వస్తే, మరో తమిళ నటుడు విడాకులు తీసుకున్నాడు అదీ తాను కాలేజీ డేస్ లో ఎంతగానో ప్రేమించిన ప్రేయసిని పెళ్లాడిన 7 ఏళ్లకే. ఆ తమిళ నటుడు పేరు విష్ణు విశాల్.
ఇతను 2009 లో వెన్నెల కబడ్డి కుళు అనే తమిళ సినిమాతో నటుడిగా కెరీర్ ని స్టార్ట్ చేసి, భలే పాండియ, జీవా, ఇంద్రు నేత్రు నాళై వంటి విజయవంతమైన సినిమాల్లో కూడా నటించాడు. ఈ మధ్యే తాను నటించిన రాక్షసన్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ వెన్నెల కబడ్డి కుళు సినిమానే తెలుగు లో వెన్నెల కబడ్డీ జట్టు పేరుతో రీమేక్ అయ్యింది నాని హీరోగా. ఇలా సాఫీగా సాగిపోతున్న విష్ణు విశాల్ వైవాహిక జీవితంలో తనకి, తన భార్య రజిని కి పొసగడం లేదని, ఇటువంటి పరిస్థితులలో కలిసుండడం అనవసరమని భావించి విడాకులు తీసుకున్నారు. వీరికి ఆర్యన్ అనే ఒక సవంత్సరం కూడా నిండని బాబు కూడా ఉన్నాడు. ఈ విడాకుల విషయాన్నీ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించిన విష్ణు విశాల్, విడిపోయిన కూడా తను, తన భార్యతో స్నేహంగా ఉంటానని, వారి బిడ్డను కలిసి గొప్పగా పెంచుతామని పేర్కొన్నాడు. ఒకరితో ఒకరికి పొసగలేదని విడాకులు తీసుకుంటే, ఆ విడాకులకు కారణం ఆ ఇద్దరిలో ఎవరిదో వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఎలా సుఖంగా ఉంటారో అనేది తెలియని ప్రశ్న.