కూకట్ పల్లి టికెట్ వెనుక బాబు స్కెచ్…!

Serilingampally Seat Confirms For Producer Anand Prasad

ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. విభజన తర్వాత తెలంగాణలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను టిడిపి అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేసిన ఆ పార్టీ ఈసారి అనూహ్య పరిణామాల మధ్య తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది. పొత్తుల ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం చాలా ఆలస్యమైంది. ఈ కారణంగా కూటమిలోని పార్టీల మధ్య చిచ్చు రేగింది. తెలంగాణ జన సమితి, సిపిఐ తమ సీట్ల కోసం పట్టుపడుతున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం అధినేత చంద్రబాబు సూచన మేరకు కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో టిడిపి చాలా స్థానాల్లో బలంగానే ఉంది. కానీ, ఆ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. బలమైన స్థానాలను వదులుకోవడం తో పాటు, టికెట్ కేటాయించే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది.

Serilingampally-Seat-Confir

తాజాగా తెలుగుదేశం పార్టీలో బయటకు వచ్చిన వివాదమే దీనికి ఉదాహరణ. అన్ని పార్టీలో లాగానే టిడిపిలో కూడా అసమ్మతి రేగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిడిపి బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఒకటి. కాబట్టి అక్కడ నుంచి బరిలోకి దిగేందుకు టిడిపి నేతలు పోటీపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా భవ్య సిమెంట్స్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ మరొకరు ఒకప్పుడు టీడీపీలోనే ఉండి తర్వాత గాంధీకి టికెట్ రాగానే టిఆర్ఎస్ లోకి వెళ్లి మళ్ళీ అక్కడ కూడా గాంధీకే టికెట్ రావడంతో ఇటీవలే మళ్ళీ టిడిపిలో చేరిన మొవ్వ సత్యనారాయణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ టికెట్ కోసం టీడీపీలోనూ రగడ మొదలయ్యింది. ఈ సీటు ఆశిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ నుంచి మళ్లీ టీడీపీలో చేరిన మొవ్వా సత్యనారాయణ కూడా శేరిలింగంపల్లిపై ఆశ పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య గొడవ మొదలయ్యింది. ఇటీవలే ఈ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద రాద్ధాంతం చేశారు.

anand-and-sathnarayana

దీంతో టికెట్ ఎవరికి వస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండేది. అయితే, టీడీపీ అధిష్టానం మాత్రం ఆనంద్ ప్రసాద్ కి టికెట్ కేటాయించింది. అయితే ఈయనకు టికెట్ ఇవ్వడం వెనక నందమూరి బాలకృష్ణ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన పైసా వసూల్ సినిమా ఆనంద్ ప్రసాద్ కు టిడిపి టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారట. ఆ హామీని బట్టే ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆనంద్ ప్రసాద్ కు టికెట్ కేటాయించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన కూకట్ పల్లి నియోజకవర్గానికి మహా కూటమి తరఫున అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు నందమూరి సుహాసిని. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి రావాలని తొలుత హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ కు టీడీపీ ఆఫర్ ఇచ్చినా, ఆయన నిరాకరించడంతో ఆ చాన్స్ ను తీసుకోవాలని సుహాసినిని కోరారు తెలంగాణ టీడీపీ పెద్దలు. ఇక ఇదే విషయాన్ని ఈ ఉదయం చంద్రబాబునాయుడి ముందు ఉంచిన టీటీడీపీ, ఆమెను నిలపాలని కోరగా, చంద్రబాబు, సుహాసిని బాబాయ్ బాలకృష్ణలు స్వయంగా ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

TDP Leaders Meets Balakrishna In Saradhi Studio

కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంతో బలముందని, నిలబడితే, గెలిపించే బాధ్యత తమదేనని ఆమెకు అభయమిచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో సుహాసిని ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించనప్పటికీ దాదపు ఆమెకే ఖరారు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఎంతైనా తన అక్క కాబట్టి జూనియర్ కూడా రంగలోకి దిగాలి అలా దిగితే ఒక్క నియోజకవర్గానికి పరిమితం అవ్వక 14 సీట్లు చుట్టి రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనినే చంద్రబాబు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు అని విశ్లేషకుల వాడన్. ఎందుకంటే తెలంగాణా టీడీపీ పగ్గాలు బుడ్డోడికి అప్పచెప్పాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది అన్నమాట. ఆ విధంగా ఆయనకు ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జాం అన్న మాట. ఒక వేళ ఆయన ప్రచారం చేసి అన్ని సీట్లూ గులుచుకుని వచ్చినా బాబు ఆయనకు పగ్గాలు ఇస్తాడని కాదు, కానీ ఒక వేళ ఓడిపోతే మాత్రం ఇప్పుడు డిమాండ్ చేసే నోళ్ళు మూయించవచ్చు.

Chandrababu Likely To Expand AP Cabinet On 11th November