ఇది నిజం అయితే.. వీరి ప్రేమ నిజం!

Anushka Guest Role For Prabhas Next

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రభాస్‌, అనుష్కల మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని గత కొంత కాలంగా మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమద్య ఒక ప్రముఖ జాతీయ స్థాయి మీడియా వ్యక్తి ప్రభాస్‌, అనుష్కలు వివాహం చేసుకోబోతున్నారని, వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం చెప్పి, పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో సంచలనంగా మారిన ఆ పోస్ట్‌పై సినీ వర్గాల్లో చర్చ జరిగింది. చివరకు అతడి వ్యాఖ్యలు నిజం కాదని, అతడు చేసిన ట్వీట్‌ అబద్దం అంటూ తేల్చి చెప్పారు. ప్రభాస్‌ మరియు అనుష్కలు స్వయంగా తాము ప్రేమికులం కాదు, స్నేహితులం అంటూ చెబుతున్నప్పటికి ఎప్పుడో ఒక సమయంలో నాగచైతన్య మరియు సమంతల మాదిరిగా బయట పడటం ఖాయం అని, ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా మరో సంఘటన ద్వారా నిరూపితం అయ్యింది అంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న కథనం ప్రకారం గత కొన్నాళ్లుగా ప్రభాస్‌ ‘సాహో’ చిత్రీకరణలో నిమిత్తం దుబాయిలో ఉన్న విషయం తెల్సిందే. అక్కడ చిత్రీకరణ కోసం భారీ ఎత్తున రిష్కీ షాట్స్‌ను దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్నాడు. సినిమా రియలిస్టిక్‌గా ఉండటం కోసం డూప్‌ లేకుండానే ప్రభాస్‌ రిష్కీ షాట్స్‌ చేస్తున్నాడు. ఆ కారణంగా రెండు చిన్న ప్రమాదాలు కూడా జరిగాయట. దాంతో అనుష్క స్వయంగా దుబాయి వెళ్లి దర్శకుడితో పోట్లాడి, ప్రభాస్‌ను రిష్కీ షాట్స్‌ చేస్తున్నందుకు మందలించి, మరోసారి అలాంటి రిష్కీ షాట్స్‌ చేయను అంటూ హామీ తీసుకుని దుబాయి నుండి అనుష్క తిరుగు ప్రయాణం అయినట్లుగా తెలుస్తోంది. ఒక స్నేహితుడి గురించి ఒక స్నేహితురాలు ఇంతగా ఆలోచించడం అనేది జరగదు. అందుకే వీరిద్దరి మద్య ఉన్నది లవ్‌ అంటూ మరోసారి నిరూపితం అయ్యిందంటున్నారు. ఈ సంఘటన కనుక నిజం అయితే ఖచ్చితంగా వీరిద్దరి మద్య ఉన్నది లవ్‌ అని నూటికి నూరుపాళ్లు చెప్పుకోవచ్చు.