అరవింద సమేతలో ఈషా కూడా

Eesha Rebba acts in NTR Aravinda Sametha Veera Raghava movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంను భారీ బడ్జెట్‌తో రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. త్రివిక్రమ్‌ సినిమా అంటే సహజంగా ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారు. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత మరియు ‘అఆ’ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా కనిపించిన విషయం తెల్సిందే. గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా దర్శకుడు త్రివిక్రమ్‌ ఇద్దరు హీరోయిన్స్‌ను ఎన్టీఆర్‌కు జోడీగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. 

మొదట ఈ చిత్రం కోసం కేవలం పూజా హెగ్డేను మాత్రమే ఎంపిక చేయడంతో త్రివిక్రమ్‌ తన గత చిత్రాల్లో మాదిరిగా కాకుండా ఈ చిత్రంలో ఒక్క హీరోయిన్‌తోనే చేయబోతున్నట్లుగా అంతా భావించారు. కాని అనూహ్యంగా రెండవ హీరోయిన్‌ను తెర పైకి తీసుకు వచ్చాడు. రెండవ హీరోయిన్‌గా తెలుగమ్మాయి ఈషా రెబ్బాను ఎంపిక చేశాడు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా పనికి రారు అంటూ ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. అయినా కూడా ఈమె తన ప్రయత్నంను చేస్తూ వస్తుంది. తాజాగా ‘అ!’ చిత్రంలో నటించి మెప్పించిన ఈషా ఇంకా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అందుకే త్రివిక్రమ్‌ దృష్టిలో పడటం జరిగింది. త్రివిక్రమ్‌ సినిమాలో ఆఫర్‌ రావడంతో ఈ అమ్మడు ఆనందంతో గెంతులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.