సుబ్రమణ్యపురం ట్రైలర్ : కార్తికేయ పార్ట్ 2 అనుకోవచ్చా…?

Subrahmanyapuram Official Trailer

మళ్ళీ రావా సినిమాతో ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని సుమంత్ ఎట్టకేలకు మంచి హిట్ కొట్టాడు. వసూళ్లపరంగా పర్వాలేదనిపించినా, సినిమాలోని కంటెంట్ పరంగా, సుమంత్ మరియు ఇతర నటీనటుల అభినయం పరంగా మంచి మార్కులు వేయించుకుంది మళ్ళీ రావా చిత్రం. ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో సుమంత్ వెంటవెంటనే రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు. వాటిలో ఒకటైన సుబ్రమణ్యపురం సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోనర్ కి చెందినదికాగా, మరో చిత్రం ఇదం జగత్ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందడం విశేషం.తాజాగా విడుదలైన సుబ్రమణ్యపురం ట్రైలర్ ని వీక్షించిన అందరూ చేస్తున్న కామెంట్ ఏమిటంటే ఇది కార్తికేయ సినిమాకి కాపీ లా ఉందేంటి? సినిమా పేరు కార్తికేయ – 2 అని పెట్టొచ్చుగా అని అంటున్న విషయంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సినిమా ట్రయిలర్ సేమ్ టూ సేమ్ కార్తికేయ సినిమాని తలపిస్తుంది.

sumanth-telugu-subramanianp

సినిమాలోని పాత్రలు కానివ్వండి, కథ నడిపిన విధానం కానివ్వండి, సుమంత్ పాత్ర యొక్క వ్యక్తిత్వం, అతను చెప్పే డైలాగులు అన్నీ కార్తికేయ సినిమానే తలపిస్తాయి. నిర్మాణవిలువల్లో రాజీ పడ్డట్టుగా అనిపిస్తుంది సినిమాను చిత్రీకరించిన విధానాన్ని చూస్తే. ఈషా రెబ్బా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, షార్ట్ ఫిల్మ్స్ నుండి వచ్చిన సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కార్తికేయ సినిమాకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర నే ఈ సినిమాకి కూడా సంగీతం అందించడం విశేషం. కథలో దమ్ముంటే ఈ సినిమా కూడా కార్తికేయ లా అందరిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇటువంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ ఎప్పటికి ఉంటూనే ఉంటుంది.