సుబ్రమణ్యపురం రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

నటీ నటులు : సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి
సంగీతం : శేఖర్‌చంద్ర
సినిమాటోగ్రఫీ : ఆర్.కె. ప్రతాప్
ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్
నిర్మాత : బీరం సుధాకర్‌రెడ్డి
రచన:నాగమురళీధర్ నామాల
దర్శకత్వం :సంతోష్ జాగర్లపూడి

సుమంత్ ను అక్కినేని హీరో అంటారు కానీ ఏఎన్నార్ కూతురు కొడుకు. అందువల్ల అక్కినేని సుమంత్ కాకకపోవచ్చు. అయితే తాత దగ్గర పెరగడమే కాదు తాత పోలికలు పుణికి పుచ్చుకున్నాడు సుమంత్. 1999 వ సంవత్సరం రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైన సుమంత్ నట జీవితం 2003 లో జెనీలియాతో నటించిన సత్యంతో చిత్రసీమలో కాస్త స్థిరపడ్డాడు. మళ్ళీ కొన్ని వైఫల్యాల తర్వాత 2006 సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత కాలంలో విడుదలైన చిన్నోడు, గౌరి అంతగా హిట్ కాలేదు. మధుమాసం మళ్ళీ బాక్సాఫీస్ లో బాగా ఆడింది. ఇక ఆ తర్వాత ఆ మధ్యన వచ్చిన ‘మళ్లీరావా’ సినిమా టైటిల్ కు తగ్గట్లే అతన్ని కెరీర్ ని మళ్లీ వెనక్కి లాక్కొచ్చిందని చెప్పాలి.

మళ్లీరావాతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లింగ్ కథాంశంతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సుమంత్‌కు 25 చిత్రం కావడం విశేషం. సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీ మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సుబ్రమణ్యపురం’ టైటిల్ తో వచ్చిన ట్రైలర్ చూసిన వాళ్లు అరే ఇది నిఖిల్ చేసిన ‘కార్తికేయ’ కు కాపీలా ఉందన్నా అని కామెంట్స్ చేసినా సినిమా చూసెయ్యాలని ఫిక్స్ అయ్యారు. మరి సుమంత్ మరో హిట్ కొట్టినట్లేనా లేక మళ్లీ పాత డిజాస్టర్ రోజులకి వెళ్లిపోయాడా ? కార్తికేయ సినిమాకు దీనికి నిజంగానే పోలిక ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కధ :

సుబ్రమణ్యపురం అనే గ్రామంలో వరసగా ఆత్మహత్యలు జరుగుతూంటాయి. ఆత్మహత్య జరగటానికి ముందు ఓ నెమలి కనపడుతుంది. దాంతో అదంతా సుబ్రమణ్యడు లీల…ఆయన వల్లే ఇలా సూసైడ్స్ జరుగుతున్నాయనే నిర్ణయానికి అక్కడ వారు వచ్చేస్తారు. ఎస్సై (అమిత్ శర్మ) ఈ ఆత్మహత్యలకు కారణం ఏమిటో కనిపెడదామని ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. మరో ప్రక్క నాస్తికుడయిన కార్తిక్ (సుమంత్) పురాతన దేవాలయాలపై రీసెర్చ్ చేస్తూంటాడు. అయితే అనుకోకుండా అతను ఆ ఊరి పెద్ద వర్మ(సురేష్) కూతురు ప్రియతో ప్రేమలో పడడం ఆమెతో ఆ వూరికి వెళ్ళడంతో అతనికి ఈ సుబ్రమణ్యం దేవాలయం గురించి, అక్కడ జరిగే సూసైడ్స్ గురించి తెలుస్తుంది. దాంతో ఆసక్తి పెరగి ఈ సూసైడ్స్ వెనక ఉన్న శక్తులను పట్టుకోవాలని, ఈ మిస్టరీ ని విడితీయాలని ఫిక్స్ అవుతాడు. కార్తీక్ ఇదంతా దేవుడు కాదు కేవలం ఎవరో కావాలని చేస్తున్నారు అని ఆ మిస్టరీని బ్రేక్ చేసేందుకు రెడీ అవుతాడు. ఈలోగా కార్తిక్ ఫ్రెండ్ మేఘన చనిపోతుంది. దాంతో పది రోజుల్లో ఈ మరణాల వెనక ఉన్న మిస్టరీ ఏంటో కనిపెడతానని ఆ ఊరి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాడు. ఆ క్రమంలో అతనికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. అప్పుడు ఓ షాకయ్యే నిజం బయిటపడుతుంది. అదేంటి ? నిజంగానే దైవ శక్తి అలా ఆత్మహత్యలకి ఉసిగొల్పుతోందా ? లేకపోతే మరెవరు చేయిస్తున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

దేవుడికి మనిషి మేదస్సుకి మధ్య జరిగిన కధ ఇది. దేవుడంటే విశ్వాసానికి, అవిశ్వాసానికి మధ్య నడిచే కధ ఇది. రాసుకున్న పాయింట్ బావుంది కానీ దిన్ని డీల్ చేయడంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. చందూ మొండేటి తీసిన కార్తికేయ ఛాయలు దాదాపు అన్ని చోట్లా కనిపిస్తాయి. అయితే కార్తికేయ ఇచ్చిన థ్రిల్ ఈ సినిమా ఇవ్వలేకపొయిందనే చెప్పాలి. థ్రిల్లర్ సినిమా చెబుతున్నాపుడు ట్విస్ట్లు టర్నింగులతో ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఐతే ‘సుబ్రహ్మణ్యపురం’లో ఆ థ్రిల్ మిస్ అయ్యింది. ‘సుబ్రహ్మణ్యపురం’లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలు ఆసక్తిని పెంచిన ఆ మిస్టరీని చేదించే విధానమే విసుగు తెప్పిస్తుంది. కధ సాగాతీతలో థ్రిల్లింగ్ మిస్సయింది. ఇలాంటి కధలకి ఒక ఫ్లో అవసరం కానీ ఇందులో కామెడి చేయాలనీ ప్రయత్నిచారు. కాని అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.సరికదా ఫ్లో కి బ్రేకులు వేసే విధంగా ఉంది. ఇలాంటి సినిమాలకి ప్రేక్షకుడు వినోదం కంటే సస్పెన్స్ కోసం వస్తాడు. అయితే అది ఇవ్వడంలో దర్శకుడు తడబడ్డాడు. ఎలా అంటే సినిమా సీన్స్ వరస చూస్తే సుబ్రమణ్యపురంలో ఓ సూసైడ్, సిటీలో సుమంత్ లవ్ స్టోరీ సీన్, మళ్లీ సూసైడ్ మరో లవ్ సీన్ ఇలా అక్కడో సీన్,ఇక్కడో సీన్ వేసుకుంటూపోయారు. క్లైమాక్స్ ట్విస్ట్ కార్తికేయ ఫార్మెట్ నే ఫాలో అయినట్లు అర్దమైపోయేలా ఉంది.

నటీనటులు :

కార్తీక్ గా సుమంత్ బాగున్నాడు గానీ అతనిలో నటుడుని బయటకు లాగే సరైన సీన్ ఒక్కటీ లేదు. ఈషా రెబ్బ, విలేజ్ అమ్మాయిగా బాగానే ఉంది. ఇక ఆమె తండ్రి నరేద్రవర్మగా చేసిన సురేష్ కాస్తంత చెప్పుకోదగిన పాత్ర. మిగిలిన వాళ్ళు అందరూ సోషల్ మీడియాలో, వెబ్ సిరీస్ లలో కనిపించే వల్లే కాబట్టి అక్కడ చేసే కామెడీనే ఇక్కడ కూడా చేశారు అనుకోవాలి. ఇక ఆర్ఆర్ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. కత్తెర కి ఇంకస్త్ పని చెప్పి ఉంటె బాగుండు అనిపిస్తుంది. పాటలు పర్లేదు.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : కార్తికేయని గుర్తు చేసిన కార్తిక్ – సుబ్రమణ్యపురం !
తెలుగు బులెట్ రేటింగ్ : 2.25 / 5