ఎన్టీఆర్‌ హీరోయిన్‌కు బంపర్ ఆఫర్‌..!

Aravindha Aametha Movie Second Heroine Eesha Rebba

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఈషా రెబ్బా నటించింది. తన అందంతో, నటనతో ఈ అమ్మడు ఎన్టీఆర్‌ సరసన నటించే ఛాన్స్‌ను దక్కించుకుంది. అయితే సినిమాలో ఈమె పాత్రకు ఎంత స్కోప్‌ ఉన్నది మాత్రం తెలియదు. రిలీజ్‌ అయ్యాక ఈషా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఇక తెలుగులో ఈ అమ్మడికి జాక్‌పాట్‌ తగిలినట్టే. సెకండ్‌ హీరోయిన్‌ అయినా కూడా ఎన్టీఆర్‌ పక్కన కాబట్టి ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది, ఒకవేళ ఈ అమ్మడు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయితే ఇక వరుస ఆఫర్లు ఖాయం.

esha-rebba-aravindha-sameth

ఎన్టీఆర్‌ తో నటించిన ‘అరవింద సమేత’ చిత్రం ఇంకా విడుదల కాకముందే ఈ అమ్మడికి మరో స్టార్‌ హీరో ఆఫర్‌ వచ్చింది. తాజాగా ఈమె కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ సరసన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. కన్నడంలో కూడా ఈ అమ్మడు స్టార్‌ హీరో ఆఫర్‌నే పట్టింది. డిసెంబర్‌లో షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలు కాబోతుంది. కన్నడంలో మంచి ఆఫర్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ అమ్మడికి శాండల్‌ వుడ్‌లో కూడా మంచి హిట్‌ తగిలేలాగా కనిపిస్తోంది. మొత్తానికి ఇద్దరు స్టార్‌ హీరోల సరసన నటంచే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈషాకు రెండు భాషల్లో త్వరలో జాక్‌పాట్‌ ఖాయంగా కనిపిస్తోంది.

esha-rebb-movies