చాలా కాలం తర్వాత ఈషా ఆ రికార్డు దక్కించుకుంది

Eesha Rebba doing Back to Back movies in Tollywood

తెలుగు అమ్మాయిలకు తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు రావు అనేది అందరు అంటూ ఉండే మాట. ఒకరు ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్‌గా పరిచయం అయినా కూడా పెద్దగా రాణించలేక పోతున్నారు. ఆమద్య శ్రీదివ్య తెలుగులో హీరోయిన్‌గా రెండు మూడు సక్సెస్‌లను దక్కించుకుంది. కాని తెలుగులో ఈమెకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం తమిళంలో శ్రీదివ్య దుమ్ము రేపుతూ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతుంది. ఈ సమయంలోనే తెలుగు అమ్మాయి ఈషారెబ్బా టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈమద్య కాలంలో ఏ తెలుగు అమ్మాయి చేయనన్ని సినిమాలు ఈషా హీరోయిన్‌గా చేయడం రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇక స్టార్‌ హీరో సినిమాలో కూడా ఈషా ఆఫర్‌ను దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

తెలుగులో ‘అమీ తుమీ’, ‘అ!’, ‘బ్రాండ్‌బాబు’ చిత్రాల్లో నటించిన ఈషా తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘అరవింద సమేత’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్‌కు జోడీగా ఈ అమ్మడు నటిస్తున్న నేపథ్యంలో ఈమె కెరీర్‌ పీక్స్‌కు వెళ్లడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ఈమె మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అందులో మొదటిది నాగశౌర్య హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో కాగా, రెండవది ఒక ప్రముఖ యువ హీరో హీరోగా నటిస్తున్న చిత్రంలో అవ్వడం విశేషం. ఈ మూడు సినిమాలు సక్సెస్‌ అయితే ఈషా మరిన్ని మంచి ఆఫర్లను ఈమె దక్కించుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు తెలుగులో ఇంతగా ఆఫర్లు దక్కించుకోవడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే ప్రథమం. అందుకే ఈషాకు అరుదైన రికార్డు దక్కింది అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.