చైతూ, సమంతలు అందుకు రెడీ అయ్యారు…!

Naga Chaitanya And Samantha Next Film Titled Majili

అక్కినేని నాగచైతన్య, అందాల తార సమంతలు కలిసి గతంలో చేసిన చిత్రాలు మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వెళ్లారు. పెళ్లయ్యాక ఇద్దరు వరుస చిత్రాలతో చాలా బిజీ అయ్యారు. త్వరలోనే ఇద్దరు జంటగా మరో చిత్రంలో కనిపించబోతున్నారు. పెళ్లయ్యాక వీరు నటించబోతున్న తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ జులైలో మొదలైంది.

samantha-movies

ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గోనడానికి చైతూ. సమంతలు రెడీ అయ్యారు. ఈ నెల రెండో వారం నుండి చైతూ, సమంతలు కలిసి షూటింగ్‌లో పాల్గోనబోతున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపించబోతున్నారు. ఈ చిత్రానికి యూనిట్‌ సభ్యులు ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పైగా ‘మజిలి’ టైటిల్‌ రిజిస్టర్‌ కూడా చేయించడంతో అంతా ఇదే టైటిల్‌గా ఫిక్స్‌ అయ్యారు. చైతూ, సమంతలు పెళ్లయ్యాక జంటగా నటించబోతుండడంతో టైటిల్‌ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది.

samantha-movie-majili