కంగారు పెడుతున్న ‘దేవదాస్‌’ కలెక్షన్స్‌…!

Nagarjuna Nani Devadas Movie Collections

అక్కినేని నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నానీ కాంభోలో తెరకెక్కిన ‘దేవదాస్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్‌, నానిల కాంబినేషన్‌ అనగానే అంచనాలు ఓ స్థాయిలో పెరిగిపోయాయి. రిలీజ్‌కు ముందు ఈ చిత్రాన్ని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా గొప్పగా ఊహించుకున్నారు. అయితే విడుదలయ్యాక మాత్రం ఆశించిన స్పందన రాలేదనిపిస్తోంది. కథ నచ్చిన కూడా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకొవడంలో ‘దేవదాస్‌’ విఫలం అయ్యిందని చెప్పకనే చెప్పవచ్చు. పోటీకి మరే చిత్రం లేకున్నా కూడా ‘దేవదాస్‌’ చాలా స్లోగా ఉన్నాడు.

devadas-movie

టాక్‌ విషయం పక్కన పెడితే నాగ్‌, నానిల కాంభో అనగానే ఓపెనింగ్స్‌ పర్లేదు అన్నట్టుగా వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్స్‌ చాలా స్లో అయ్యాయి. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి స్పందన రాకపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వస్తదేమో అని యూనిట్‌ సభ్యులు కంగారు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రావడానికే ఇంకా వారం పట్టేలా ఉంది, ఇక లాభాలు అంటే ఇంకో రెండు మూడు వారాలైనా కావాలి, కానీ ఈ లోపే ‘నోటా’, ‘అరవింద సమేత’ చిత్రాలు రాబోతున్నాయి. అవి వస్తే ఇక ‘దేవదాస్‌’కు బ్రేక్‌ పడడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓవర్సీస్‌లో కూడా ఆశించినట్టుగా ఫలితాలు రాకపోవడంతో యూనిట్‌ సభ్యులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.

devadas