‘దేవదాస్‌’ ప్రివ్యూ…!

davadas-preview

టాలీవుడ్‌లో ఈమద్య మల్టీస్టారర్‌ల జోరు మళ్లీ మొదలైంది. తెలుగులో వరుసగా వస్తున్న మల్టీస్టారర్‌ చిత్రాలతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాగార్జున గతంలో కార్తీతో కలిసి ఒక మల్టీస్టారర్‌ చేశాడు. కాని నాని మొదటి సారి మల్టీస్టారర్‌ చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంచనాలు పెంచేలా ఈ సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌లు ఉన్నాయి.

devadas

నాగార్జున డాన్‌ పాత్రలో, నాని ఒక అమాయకపు డాక్టర్‌ పాత్రలో నటించారు. ఇది ఒక హాలీవుడ్‌ సినిమాకు ప్రీక్వెల్‌ అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే సినిమా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అత్యధికంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. 50 కోట్లకు మించి ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాత ఖాతాలో వేసినట్లుగా తెలుస్తోంది. మహానటి వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం అంతకు మించిన విజయాన్ని దక్కించుకుంటుందనే ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతుంది. గీత గోవిందం ఫేం రష్మిక మరియు ఆకాంక్షసింగ్‌లు ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్‌ అయితే మరిన్ని మల్టీస్టారర్‌ చిత్రాలు రావడం ఖాయం అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

davadas-movies