‘దేవదాస్‌’కు పాజిటివ్‌ బజ్‌…!

Devdas Movie Get Release Tomorrow

నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి సారి నాగ్‌, నాని కలిసి నటించిన కారణంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నాగార్జున డాన్‌ పాత్రలో, నాని అమాయకపు డాక్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇక రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రత్యేక షోలు పడిపోతున్నాయి. ఈ షోల ద్వారా సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య ఈ చిత్రాన్ని అంచనాలకు తగ్గట్లుగా తెరకెక్కించాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

devadas

తాజాగా సినిమాపై నాగార్జున స్పందిస్తూ.. ఇప్పుడే సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది. సినిమా హిట్‌ అవ్వడం ఖాయం అంటూ నాగార్జున ధీమాగా ఉన్నాడు. ఒక మంచి సినిమా చేశాను అనే సంతృప్తి ఉందని, ప్రేక్షకులు కూడా మంచి సినిమా చూశామని అనుకుంటారు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. నానికి జోడీగా ఈ చిత్రంలో రష్మిక నంటించగా, నాగార్జునకు జోడీగా ముద్దుగుమ్మ ఆకాంక్ష నటించింది. అశ్వినీదత్‌ నిర్మాణంలో మహానటి చిత్రం తర్వాత రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మహానటిని మించి ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

davadas-movies-nagarjuna