‘దేవదాస్‌’లు ఎంత నష్టమో తెలుసా?

devdas movie 15 crore budget loss

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్‌ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మల్టీస్టారర్‌ మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. అలాగే ఈ చిత్రానికి కూడా భారీ అంచనాలు వచ్చాయి. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను తెరకెక్కించినట్లుగా శ్రీరామ్‌ ఆధిత్య చెబుతూ వచ్చాడు. పైగా ఈ చిత్రం అశ్వినీదత్‌ నిర్మాణంలో వైజయంతి మూవీస్‌ లో తెరకెక్కింది. దాంతో ఈ చిత్రంకు భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది. ఈ చిత్రం తప్పకుండా భారీగా లాభాలను తెచ్చి పెడుతుందని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు అనుకున్నారు.

nani devadas movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అన్ని ఏరియల్లో కలిపి దాదాపు 40 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. కాని సినిమా కేవలం 25 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. మొత్తంగా ఇంకో 15 కోట్ల నష్టాలను డిస్ట్రిబ్యూటర్లకు కట్టబెట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఇంత భారీ నష్టాల నడుమ చిత్రాన్ని ఇంకా నడిపినా కూడా ప్రయోజనం ఉండదని నిర్ణయించుకున్నారు. అందుకే సినిమాను మెల్ల మెల్లగా తీసేస్తున్నారు. నోటా వచ్చిన నేపథ్యంలో దేవదాస్‌ల క్రేజ్‌ మరింతగా తగ్గింది. దాంతో సినిమా క్లోజింగ్‌ కలెక్షన్స్‌ 25 కోట్లే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.