ఆమె మంచి అమ్మాయి.. ఇంకేం అడగకండి

Vijay Devarakonda NOTA Movie Area Wise Box Office Collections

విజయ్‌ దేవరకొండ ఒక ఫారిన్‌ అమ్మాయితో ఉన్న ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే. కొందరు ఆ అమ్మాయితో విజయ్‌ కలిసి నటించాడు అంటూ చెప్పే ప్రయత్నం చేసినా కూడా తాజాగా విజయ్‌ దేవరకొండ అసలు విషయం చెప్పేశాడు. విజయ్‌ దేవరకొండ తాజాగా ఆ ఫొటోల గురించి మాట్లాడుతూ అందులో ఉన్నది నేనే అని తేల్చి పారేశాడు. అందరి మాదిరిగా తాను అందులో ఉన్నది నేను కాదు, అవి మార్ఫింగ్‌ అంటూ సొల్లు కబుర్లు చెప్పను, ఆ ఫొటోల్లో ఉన్నది నేనే, ఆ అమ్మాయి కూడా నాకు తెలుసు అన్నాడు.

vijay Devarakonda

ఇంకా విజయ్‌ మాట్లాడుతూ.. ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిది అని, ఆమె గురించి అంతకు మించి నేను ఏం చెప్పను అన్నాడు. ఆమె గురించి మీరు మర్చిపోండి, ఆమె విషయంలో నేను ఏం మాట్లాడను అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో విజయ్‌ దేవరకొండకు ఆమె మాజీ లవర్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్‌ దేవరకొండకు ఆమెకు గతంలో లవ్‌ ఉండేదని, కాని ఇప్పుడు వారిద్దరి మద్య లవ్‌ లేదు, బ్రేకప్‌ అయ్యిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.