నా గ్లామ‌ర్ కు కార‌ణం అమ్మ…

Rajani Bhatia, Tamannaah Bhatia

త‌మ‌న్నా తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం సినిమాలో న‌టిస్తూ అగ్ర క‌థానాయిక గా పేరు తెచుకున్న విషయం తెలిసిందే. త‌మ‌న్నా ను అందరు ముద్దుగా మిల్కీ బ్యూటీ అంటారు. ఎందుకంటే పాలు ఏంత తెల్ల గా ఉంటాయే త‌నుకూడ అంతే అందంగా ఉంటుంది. త‌న అందానికి కార‌ణం ఎవ‌రు అని అడిగితే మాత్రం త‌ను మా అమ్మే అని చెప్పుతుంది ఈ మిల్కీ బ్యూటీ. సినిమా ఇండ‌స్ట్రీలో అందం అనేది ముఖ్య‌మైన విష‌యం, అలా అని గ్లామ‌ర్ ఒక్క‌టే ఉంటే స‌రిపోదు.

tamanna talks about her mother

అందంతో పాటు న‌ట‌న కూడ చాలా ముఖ్యం అని చెప్పుతుంది. గ్లామ‌ర్ గా ఉంటే త‌ప్ప ఇక్క‌డ అవ‌కాశాలు రావు. నేను కూడ ఓ స‌గ‌టు అమ్మాయిలాగే అందం గురించి అలోచిస్తుంటా, షూటింగ్ ఉన్న‌ప్పుడు మేక‌ప్ త‌ప్ప‌నిస‌రి, వాటివ‌ల‌న ఒక్కోసారి స్కీన్ కూడా పాడ‌వుతుంది. మ‌ర‌ల‌ ఒక్క‌సారి ప్యాక‌ప్ చెప్పితే నేనే సాదార‌ణ అమ్మాయిలా మారిపోతాను అంటుంది. అందం గా క‌నిపించాలి అని ప్ర‌తి అమ్మాయికి ఉంటుంది. కాక‌పోతే సినిమా తార‌ల‌కు కాస్త ఏక్కువ గా ఉంటుంది, నేను మాత్రం నా అందంను కాపాడుకోవాడానికి మా అమ్మ ఏమి చెప్పితే అది చేస్తాను. నేను ఇంత అందంగా ఉన్నాను అంటే ఖచ్చితంగా మా అమ్మ కారణం.