‘ఎన్టీఆర్‌’కు డబుల్‌ లాభాలు

Balakrishna High Budget Collect In Ntr Biopic

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. భారీ ఎత్తున ఈ చిత్రం వసూళ్లను రాబట్టడం ఖాయం అనే నమ్మకంతో అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. రెండు పార్ట్‌లను కూడా ఏరియా వారిగా సేమ్‌ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అన్ని ఏరియాల్లో కూడా గుండు గుత్తగా రెండు పార్ట్‌లను అమ్మేసినట్లుగా సమాచారం అందుతుంది. కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఈ చిత్రం దాదాపుగా 80 కోట్ల మేరకు దక్కించుకుందట.

Balakrishna

రెండు పార్ట్‌లకు కలిపి థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా 80 కోట్లు రాగా, ఇక శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఇతరత్ర రైట్స్‌ ద్వారా 30 కోట్లకు పైగా నిర్మాత ఖాతాలో పడబోతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం నిర్మాత బాలకృష్ణకు భారీగా లాభాలను తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణలో క్రిష్‌ చాలా బిజీగా ఉన్నాడు. దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రం విడుదల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే రెండు పార్ట్‌లను విడుదల చేయడం వల్ల మంచి వసూళ్లను రాబట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’ అనే టైటిల్స్‌తో రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ సంక్రాంతికి, రెండవ పార్ట్‌ రిపబ్లిక్‌ డేకు విడుదల చేయబోతున్నారు.