‘దేవదాస్‌’లు నిరాశ పర్చినట్లే…!

Devdas Movie Dropped In The Second Day Collections

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు భారీ ఓపెనింగ్స్‌ దక్కాయి. మొదటి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను మిగిల్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం విడుదలైన రెండవ రోజు నుండి కలెక్షన్స్‌ చాలా డ్రాప్‌ అయ్యాయి.

devadas-movie-nagarjuna

భారీ ఎత్తున ఈ చిత్రంపై వచ్చిన అంచనాల దృష్ట్యా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 35 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతుంది. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం కనీసం 20 కోట్ల వరకు అయినా షేర్‌ను రాబట్టే అవకాశం లేదని సమాచారం అందుతుంది. ఈ శని ఆదివారాల్లో ఒక మోస్తరుగా ఈ చిత్రం రాణిస్తుందని ఆశ పెట్టుకున్నా కూడా మొదటి నాలుగు రోజుల్లో 15 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో అయిదు కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చు. అంటే మొత్తంగా 20 కోట్ల వద్ద ఈ చిత్రం ఆగిపోయే అవకాశం ఉంది.

devadas-movie