నానికి అంత టైమ్ ఎక్కడిది…?

Nani Not Writing Screenplay Of Vikram Kumar Film

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతం తిన్ననురి దర్శకత్వంలో జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. క్రీడ నేపద్యంలో జెర్సీ చిత్రం రూపొందుతుంది. నాని ప్రముఖ క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రాని ఏప్రిల్ మంత్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత నాని విక్రం కె కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తాడు. ప్రస్తుతం సమాజంలో ఆడవారిపైన జరిగే అకృత్యాలను విక్రం చుపించానున్నాడు. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ నటిస్తారు. కానీ నాని మాత్రం ఒక్కరితోనే రొమాన్స్ చేయ్యనున్నాడు. నాని విక్రం కె కుమార్ చిత్రాని మర్చి మొదటి వారం నుండి సెట్స్ పైకి తిసుకేల్లనున్నాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పనిలో విక్రం బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు ఈ స్క్రిప్ట్ విషయంలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. విక్రం కె కుమార్ స్క్రిప్ట్ విషయంలో నాని జోక్యం చేసుకుంటున్నాడని, తనకు అనుగుణంగా స్క్రిప్ట్ ను మారుస్తున్నాడు  అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో భాగా వైరల్ అవ్వడంతో విక్రం కె కుమార్ స్పందించక తప్పలేదు. నాని నా స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. ప్రస్తుతం జెర్సీ షూటింగ్ పనులతో చాలా బిజీగా ఉన్నాడు నానికి ఇప్పుడు అంత టైం లేదు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పనులు మాత్రం చాలా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. త్వరలోనే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అన్నారు. విక్రం కె కుమార్ సినిమా తరువాత ఇంకో రెండు మూడు సినిమాలు నాని చేతిలో ఉన్నాయి.