ఈ అన్నదమ్ముళ్ళకు కలిసి వచ్చేనా…?

Two Young Heroes Future In Charan And Mahesh Babu Hands

ప్రముఖ దర్శకుడు స్వర్గీయ శ్రీ ఇవివి సత్యనారాయణకు ఇద్దరు కొడుకులు పెద్ద వాడు ఆర్యన్ రాజేష్, చిన్నవాడు అల్లరి నరేష్. ఈ ఇద్దరినీ స్టార్ హీరోస్ గా చెయ్యాలని ఇవివి కలలు కనేవాడు. ఇవివి బ్రతికి ఉన్నని రోజులు ఈ ఇద్దరికి పెద్దగ కష్టం అంటే ఏమిటో తెలియదు. కారణం ఇవివి చాలా గొప్ప డైరక్టర్ మంచి మంచి సినిమాలు తీశాడు. చిన్న కొడుకు అల్లరి నరేష్ తో చాలా సినిమాలు కామెడి ప్రధానంగా ఉండే సినిమాలు తీశాడు రాజేంద్రప్రసాద్ వారసుడిగా అల్లరి నరేష్ ను చెప్పుకున్నేవారు. ఆర్యన్ రాజేష్ ను మాత్రం ఓ స్టార్ హీరోగా చూడాలని ఇవివి అనుకునేవాడు.

Two-Young-Heroes-Future-In-

ఆర్యన్ రాజేష్ కూడా ఓ రెండు మూడు సినిమాలో హీరోగా మెప్పించాడు. తండ్రి మరణం తరువాత ఆర్యన్ రాజేష్ చేసిన సినిమాలు వరుస ప్లాప్ లను ముట్టగట్టుకున్నాయి. అల్లరి నరేష్ పరిస్థితి కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పుడు వీరిద్దరికీ చేతిలో సినిమాలు కూడా ఏమి లేవు. ఆర్యన్ రాజేష్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ కు అన్నయ్య గా నటిస్తున్నాడు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ల చుట్టూ ఆ కథ నడుస్తుంది. ఇకా అల్లరి నరేష్ కూడా మహర్షి మూవీ లో మహేష్ బాబు సపోర్టింగ్ క్యారక్టర్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కెరీర్ కూడా ఆ స్టార్ హీరోస్ చేతిలోనే ఉన్నది. ఆ రెండు సినిమాలు మంచి విజయాని సాదిస్తే మాత్రం ఆర్యన్ రాజేష్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు వస్తాయి.