“ఎన్‌టి‌ఆర్”లో బాలయ్య పాత్రను ఆ బుడ్డోడు…!

Mokshagna To Play Balakrishna Character

తెలుగు దేశం పార్టీ అధినేత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో అందిస్తున్నాడు. ఈ చిత్రం నిన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను జరుపుకుంది. ఈ ఆడియో ఫంక్షన్ కు నందమూరి కుటుంబ సభ్యులు అతిధులు విచ్చేశారు. బాలకృష్ణ ఇద్దరి కూతుళ్ళు మరియు మనవళ్లు తాత గారు నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కోసం విచ్చేసారు . ఎన్టీఆర్ చిత్రంలో ఎంతో మంది తెలుగు పరిశ్రమకు చెందినా నటులు నటించారు. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ మొదలైనప్పుడు నుండి ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే ఆశక్తి కరమైన ప్రశ్న ప్రతి మనసులోనూ ఉంటుంది.

ఆ పాత్రలో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నటిస్తాడు అన్నారు. మరియు బాల బాలకృష్ణుడు పాత్రలో ఎవరు నటిస్తారు అనుకున్నారు అందరు. అందుకు క్రిష్ ఆ పాత్రలో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి కొడుకుని బాలకృష్ణ చిన్నపటి పాత్రలో క్రిష్ నటింపజేశాడంట . ఆ విషయం బాలకృష్ణ చెప్పుతూ ఎంతగానో మురిసి పోయాడు. బాలకృష్ణ పెద్దగా ఉన్నపుడు ఎవరు నటించారు అనే విషయం ఇంతవరకు తెలవదు. అసలు బాలకృష్ణ పెద్దవాడిగా ఆ పాత్ర ఉంటుంది అనుకోవడంలేదు. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదలవుతుంది. యన్బికే ప్రొడక్షన్ పైన బాలకృష్ణ ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి సంగితంను అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు