ఎన్టీఆర్ బయోపిక్ పైన జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాక్యలు…!

Jr. NTR Speech At NTR Biopic Audio Launch

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కి నందమూరి ఫ్యామిలీ తో పాటు పలువురు సిని, రాజకీయ నాయకులు అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మనవడు, హరి కృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నందమూరి వంశంలో నేనుకూడా ఒక్కడిని అయ్యినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ నేను ఇక్కడకు వచ్చింది మాత్రం నందమూరి కుటుంభంలోని వ్యక్తిగా మాత్రం రాలేదు ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన ఒక్క వ్యక్తిగా ఇక్కడకు వచ్చాను అన్నారు.

ప్రతి తెలుగు ఇంటి బిడ్డ ఎన్టీఆర్ గారు , అలాంటి అయన జీవిత చరిత్రను రూపొందించిన క్రిష్ గారికి, బాబాయ్ బాలకృష్ణ గారికి నా మనః పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా మాట్లాడుతూ తెలుగు వారని పిలవని ఆ రోజుల్లో పక్క రాష్ట్రం పేరు పెట్టి పిలుస్తున్న ఆ రోజుల్లో ఎందరో ప్రముఖులు చేసిన త్యాగాలల్లో ఎన్టీఆర్ గారు ప్రముఖుడు అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విజయం మంచి విజయం సాదించాలని, అసలు విజయం సాదించాకే ఈ చిత్రం మొదలైందని చరిత్రకు జయాపజయాలు ఉండవు అన్నారు. భావితరలుకు ఈ చిత్రాన్ని అందిస్తున్న బాబాయ్ కి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవ్వుతుంది అన్నారు. నాన్న గారు హరికృష్ణ గారు తాత గారు గురుంచి ఎన్నో కథలు చెప్పేవారు కానీ, ఆయన గురుంచి ఇంకా మిగిలే ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ లో మనం చూసేది చాలా తక్కువ అన్నారు.