జమున మాట్లాడుతుండగా నోరు మూసిన బాలయ్య… ఎందుకంటే…?

Actress-Jamuna-Speech-At-NT

సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న అన్నగారు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ‘ఎన్టీఆర్‌’ చిత్రం రూపొందుత్ను విషయం తెల్సిందే. దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర మొదటి పార్టు ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక ఘనంగా జరుగింది. ముందుగా అనుకున్నట్టుగానే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్‌ కూతుళ్ల చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు.

ఈ వేడుకకు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన పలువురు నటీ నటులు కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ సరసన రొమాన్స్‌ చేసిన సీనియర్‌ హీరోయిన్లు ఈ వేడుకకు హాజరయ్యారు. సీనియర్‌ నటీమణి జమున ఈ వేడుక సందర్భంగా బాలక్రిష్ణని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తింది. తల్లిదండ్రుల పరువు తీసే పిల్లలు ఉన్న ఈ కాలంలో బాలక్రిష్ణ తన తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి పేరును నిలబెడుతున్నాడు. అంతేకాకుండా తన తండ్రి చరిత్రను ఈ తరం వారికి తెలియజేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది అంటూ జమున చెప్పుకొచ్చారు.

బాలయ్యబాబు ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నాడు. ఇక ఈ ప్రయత్నంతో తండ్రిని మించిన అనగానే పక్కనే ఉన్న బాలక్రిష్ణ తన చేతిని జమున నోటికి అడ్డు పెడుతూ అలా అనవద్దు అమ్మా అని తన చేతిని పక్కకు తీశాడు. ఆ తర్వాత తండ్రిని మించిన తనయుడు అని ఎందుకంటున్నాను అంటే ఎన్నో పాత్రలను పోషించిన తన తండ్రి యొక్క చరిత్రతను ఈ చిత్రం ద్వారా ఈతరం వారికి చూపెట్టే ప్రయత్నం చేసినందుకు అంటున్నాను అని జమున చెప్పుకొచ్చింది. ఇక తన ఆశీస్సులు బాలక్రిష్ణకు ఎప్పుడు ఉంటాయి అని జమున ఆశీర్వదించింది.