బోయ‌పాటి హర్టయ్యాడా…?

Boyapati Hurt With Ram Charan Letter To This Fans

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రేక్ష‌కాభిమానుల‌ను ఉద్దేశించి నిన్న‌టి రోజున రాసిన లేఖ ప‌ట్ల బోయ‌పాటి ఫీల‌య్యాడనే వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకులకి రాసిన లేఖలో క‌నీసం త‌న పేరు ప్ర‌స్తావ‌న‌కు కూడా తీసుకురాలేద‌ని ఆయన హర్ట్ అయ్యాడని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ ఇటీవ‌ల విడుద‌లై ప‌రాజ‌యం చెందిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై సినిమా ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు అందుకుంది.

దీంతో సినిమా నిర్మించిన నిర్మాత దాన‌య్య డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు తిర‌గి చెల్లించాల్సి వ‌చ్చింది. వివిఆర్ రిజ‌ల్ట్ ప‌ట్ల అభిమానులు అంతే బాధ‌ప‌డ్డారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నిన్న‌ ప్రేక్ష‌కాభిమానుల‌ను, సినిమా ఫ‌లితాన్ని ఉద్దేశించి చెర్రీ సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేసి షాకిచ్చాడు. ఈ లేఖ‌లో దాన‌య్య పేరు ప్ర‌స్తావించిన చరణ్ బోయ‌పాటి పేరును మారం ప్ర‌స్తావించ‌లేదు. దీంతో బోయ‌పాటి ఫీలైట‌న్లు టాక్. ఆయన స‌న్నిహితుల వ‌ద్ద నిర్మాత పేరు ప్రస్తావిస్తారు కానీ డైరెక్టర్లు ప‌నికారా ? అంటూ ఫీలయ్యడని అంటున్నారు. నిజమెంతో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వినిపిస్తోంది.