కాపీ లువాక్ ఎలా తాయారు చేస్తారో తెలుసా…?

Ram Surprising And Costly Gift To Puri Jagannath

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ అత్యంత ఖరీదైన కాఫీ గింజల ప్యాకెట్‌ను కానుకగా ఇచ్చాడట. దీనిని కోపీ లువా‌క్‌ అంటారు. దీని గురించి గూగుల్‌లో వెతకండి. మీకు ఈ కాఫీ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. నేను ఈ కాఫీని తాగుతున్నాను’ అంటూ ఫొటోలను పోస్ట్‌ చేశారు. అయితే ఈ కాఫీ గురించి వాకాబు చేస్తే పలు విషయాలు బయటకు వచ్చాయి. ఇది పునుగు పిల్లి. దీని చర్మం నుంచి వెలువడే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి ఉపయోగిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. కోపీ లువాక్ అని పిలిచే ఆ కాఫీ గింజలు ధర కిలో రూ.35 వేలకు పైమాటే. ఖరీదైన రెస్టారెంట్లలో అయితే కప్పు కాఫీ ధర రూ.5 వేలు! ఇంతకీ ఈ కాఫీ ఎలా త యారుచేస్తారంటే.. ముందుగా వీటితో కాఫీ పళ్లను తినిపిస్తారు.

పునుగు పిల్లులు వాటిని తిని.. జీర్ణం చేసుకోగా.. మిగిలిపోయిన గింజలను విసర్జిస్తాయి. వాటిని ఎండబెట్టి.. అమ్ముతారు. పునుగు పిల్లి విసర్జించిన గింజలతో చేసిన కాఫీ రుచి మృదుమధురంగా ఉంటుందట. ఎందుకిలా అంటే.. పునుగు పిల్లులకు ఎన్ని కాఫీ పళ్లు పెట్టినా.. నాణ్యమైన వాటినే తింటాయట. పైగా.. వాటి జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల వల్ల గింజలకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందట. ముఖ్యంగా ఇండోనేసియాలో ఈ తరహా కాఫీ తయారీ ఎక్కువ. ఈ కాఫీకి బాగా డిమాండ్ ఉండటంతో ఇందుకోసం అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే పునుగు పిల్లులను పట్టి.. చిన్నచిన్న పంజరాల్లో బంధించి.. హింసిస్తున్నారంటూ వన్యప్రాణి హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.