ఎన్టీఆర్ ని ఉద్దేశించి యాత్ర డైరెక్టర్ సంచలన ప్రకటన…!

Director Mahi V Raghav Emotional Speech On Yatra Movie

ఆంధ్రుల అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు, జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఈ మట్టిలో పుట్టిన మాణిక్యాలేనని ‘యాత్ర’ దర్శకుడు మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. యాత్ర సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన ద్వారా ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. భిన్నాభిప్రాయాలు, విభేదాలతో ఆ మహానుభావులను అగౌరవపరచవద్దని ఆయన కోరారు. మహా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కథను ప్రజలకు చెప్పే అవకాశం నాకు దక్కడం అదృష్టమని నిజంగా గొప్ప గౌరవమని వైఎస్ కుటుంబ సభ్యులు, ఆయన లక్షలాది అభిమానులు అందించిన అసాధారణ ప్రోత్సాహానికి రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం ఎంతో శ్రమించిందని, ఈ ప్రాజెక్ట్‌ను ఒక రేస్‌లా భావించి చేశామని ఆయన యాత్ర మీకు ఒక వేడుకలా మారి మీలో ఆనందం ఉప్పొంగేలా చేస్తుందని ప్రకటించారు. ఎవరో ద్వేషించినంత మాత్రాన నాకు వైఎస్సార్ లేదా చిరంజీవి గారిపై ఉన్న ప్రేమ పోదు. మన భిన్నాభిప్రాయాలు, ప్రశంసలను పక్కనబెట్టి దిగ్గజాలను గౌరవిద్దాం. అదే మనం వాళ్లకు ఇచ్చే నివాళి. మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. సినిమా చూసిన తరవాత మీ స్పందనను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీ స్పందన కఠినంగా ఉన్నా స్వీకరిస్తాను. తరవాత సినిమాను మరింత బాగా తీయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు అని తన ప్రకటనలో మహి వి.రాఘవ్ పేర్కొన్నారు.