మినీ స‌మంత‌గా డైరెక్టర్ కుమార్తె !

BVS Ravi Daughter To Act As Samantha's Child Role

టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య చైల్డ్ హుడ్ పాత్ర‌ల‌కు మంచి ప్రాముఖ్య‌త సంత‌రించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకూ సినిమాలో భాగంగా వీలైనంత వ‌ర‌కూ సినిమా ఇండ‌స్ర్టీలో ఆ సినిమాల ద‌ర్శ‌కుల కుమారుడు, కుమార్తె లేదా? నిర్మాత రిఫ‌ర్ చేసిన బాల‌ల‌నే తీసుకునేవారు. కానీ ఇటీవ‌ల ఆ పాత్ర‌లు పండాలంటే ప‌క్కాగా యాప్ట్ అయ్యే వాళ్లు కావాల‌ని, ఫ్యాష‌న్ తో ఉన్న వాల్ల‌నే కొంత మంది ద‌ర్శ‌, నిర్మాత‌లు ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు స్టార్ హంట్ ను ఏర్పాటు చేసి తీసుకుంటున్నారు. తాజాగా స‌మంత న‌టిస్తోన్న మిస్ గ్రానీ రీమేక్ లో ఆమె చైల్డ్ హుడ్ పాత్ర కోసం చాలా మంది బాల న‌టుల‌ను ప‌రిశీలించి చివ‌రికి రైట‌ర్ బి.వి.ఎస్.ర‌వి కుమార్తెను తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఆ బాలిక పేరు స్వ‌ర‌. ఆ చిన్నారిపై టెస్ట్ షూట్ కూడా నిర్వ‌హంచిన‌ట్లు తెలుస్తోంది. మిస్ గ్రానీ తెలుగు టైటిల్ గా ఓ బేబి అనే పేరును ప‌రిశీలిస్తున్నారుట‌. ఎంత స‌గ్గ‌గున్నావే అన్న‌ది ఉప శీర్షిక అని ప్రచారంలో ఉంది. మ‌రి అందులో వాస్త‌వం ఎంత‌న్నది యూనిట్ ధృవీక‌రించాల్సి ఉంది. తెలుగులో ఈ సినిమాని నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్నారు. స‌మంత 70 ఏళ్ల వృద్దిరాలి పాత్ర‌తో పాటు డిఫ‌రెంట్ గెట్స్ లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సురేష్ బాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.