తెలుగులోకి రెడీ అవుతున్న మరో సూపర్ హిట్ రీమేక్ !

Gopichand And Tamannaah To Team Up For 'Tiger Zinda Hai' Telugu

ఏ భాషలోనైనా రీమేక్‌లు కొత్త కాదు. భారీ విజయాలు సాధించిన చిత్రాలను రీమేక్‌ చేయడం అన్ని భాషల్లోనూ జరుగుతుంటుంది. ప్రస్తుతం ‘క్వీన్‌’, ’96’ చిత్రాలు తెలుగులో సహా అన్ని బాషలలో రీమేక్‌ అవుతున్నాయి. అలాగే మన తెలుగులో సూపర్ హిట్ లు అయిన టెంపర్, అర్జున్ రెడ్డిలు కూడా ఇతర బాషల్లోకి రేమీక్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘టైగర్‌ జిందా హై’ సైతం తెలుగులోకి రీమేక్‌ కాబోతోందని సమాచారం. గోపీచంద్‌ ఈ రీమేక్‌పై మరింత ఆసక్తి చూపుతున్నారట. ఇందులో గోపీచంద్‌, తమన్నా జంటగా నటించనున్నట్టు తెలుస్తోంది. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.

స్పై నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజా రీమేక్‌లో సల్మాన్‌ పాత్రలో గోపీచంద్‌, కత్రినాగా తమన్నా నటించనున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం అలా ఉంచితే, గోపీ హీరోగా ప్రస్తుతం తిరు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో కూడా కథానాయికగా తమన్నా పేరు వినిపించడం విశేషం. కానీ కత్రినా జిరాక్స్ కాపీ గా పేరొచ్చిన జరీన్ ఖాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందట. తమన్నా ప్రస్తుతం తెలుగులో నరసింహారెడ్డి’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’, ‘దేవి 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.