బాబోయ్.. ఇప్పుడు వద్దు శ్రీను…!

Nagarjuna-Avoids-Srinu-Vait

వరస ప్లాప్ లతో సతమవుతున్న డైరక్టర్ శ్రీను వైట్ల కు తాజాగా మరో దెబ్బ పడ్డ విషయం తెలిసిందే. మహేష్ బాబు దూకుడు సినిమా తర్వాత నుండి శ్రీను వైట్ల సినిమాలు కలిసి రావడం లేదు. మొన్న రవి తేజ తో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం పరాజయంపాలు అవ్వడం తో శ్రీను వైట్ల తో సినిమాలు చెయ్యడానికి ఎ హీరో కూడా ముందుకు రావడం లేదు. తదుపరి సినిమాను అఖిల్ తో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో  మజ్ను అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఆ చిత్రాన్ని జనవరి లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Nagarjuna Avoids Srinu Vaitla Direction

 

అప్పట్లో నాగార్జున తో శ్రీను కింగ్ అనే చిత్రం ను తీశాడు. ఆ చిత్రం మంచి విజయంను దక్కించుకుంది, ఆ చిత్రం తరువాత అందరు నాగార్జున ను కింగ్ నాగార్జున అని పిలుస్తున్నారు. అప్పటి నుండి నాగ్ కు వైట్ల కు మంచి అనుభందం ఉన్నది. ఈ మధ్యే నాగార్జున ను కలిసినా శ్రీను అఖిల్ తో ఓ సినిమా ను చెయ్యాలి అనుకున్నట్లు చెప్పాడు అంట. నాగార్జున దానికి సమాధానంగా నో అని చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త వినపడుతుంది. అఖిల్ కూడా సారైనా హిట్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి సమయంలో అఖిల్ ను శ్రీను చేతిలో పెట్టాలని నాగ్ భావించడం లేదట. దాంతో శ్రీను చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.