నాని ఒకే అంటే నేను రెడీ!

Nagarjuna at Devadas audio launch

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాస్‌’ చిత్రం ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ఆడియో వేడుక తాజాగా జరిగింది. ఆ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నానితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని, నాని డైలాగ్‌ డెలవరీ తనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఈ చిత్రంలో మరో హీరోగా నానిని అనుకుంటున్నాం అన్నప్పుడు వెంటనే ఓకే చెప్పాను. చాలా రోజులుగా నానితో ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేయాలని కోరుకుంటున్నా. అది ఇప్పుడు తీరింది అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

Devadas Movie Latest Poster

‘దేవదాస్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో చాలా సరదాగా గడిచి పోయిందని, అంతా కూడా సరదాగా గడిపాం అన్నాడు. దర్శకుడు మంచి స్క్రిప్ట్‌ను తీసుకు వస్తే ‘దేవదాస్‌’, నాని ఓకే అంటే నేను వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాను. నానితో మరో సారి నటించాలని కోరుకుంటున్నాను. అలాంటి అవకాశం సీక్వెల్‌తో వస్తే వదులుకుంటానా అంటూ నాగార్జున అన్నాడు. నానితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా నాగార్జున చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. నాగ్‌ వంటి స్టార్‌ హీరో ఒక చిన్న హీరోతో ఇంతగా సినిమాను చేయాలని కోరుకోవడం కాస్త విడ్డూరం అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. నాగార్జున మరో వైపు ధనుష్‌తో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. తెలుగు మరియు తమిళంలో ఆ చిత్రం రూపొందబోతుంది.