చరణ్‌, ఎన్టీఆర్‌ మరో సినిమా..!

Jr.Ntr Next Movie Confirmed in Ram Charan Production

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అయ్యి 2020వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు ఈ మల్టీస్టారర్‌ రాబోతుంది. ఈ చిత్రంను దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

RRR Movie

మల్టీస్టారర్‌ చిత్రం కాకుండా మరో ప్రాజెక్ట్‌ రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రాబోతుంది. రామ్‌ చరణ్‌ ఈమద్య కొణిదెల ప్రొడక్షన్స్‌ను స్థాపించిన విషయం తెల్సిందే. ఆ ప్రొడక్షన్స్‌లో ఎన్టీఆర్‌ హీరోగా ఒక చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్‌ చరణ్‌ ఇప్పటికే తండ్రి చిరంజీవితో ఖైదీ నెం.150 మరియు సైరా చిత్రాలను నిర్మించాడు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌తో కూడా ఒక చిత్రాన్ని నిర్మించాలని చరణ్‌ భావిస్తున్నాడు. చరణ్‌పై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే సినిమా కోసం కథ మరియు దర్శకుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. మల్టీస్టారర్‌ మూవీ తర్వాత అంటే 2020లో వెంటనే మరోసారి వీరిద్దరి కాంబో మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరు ఖచ్చితంగా రెండవ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.