కాపీ అంటే ఒప్పుకోనంటున్న దర్శకుడు…!

Devadas Movie Copied From Hollywood Movie Analyze This

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ భారీ అంచనాల నడము మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలు మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వబోతున్నట్లుగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో తేలిపోయింది. ఇక ట్రైలర్‌ భారీ ఎత్తున సక్సెస్‌ అయిన కారణంగా సినిమాకు అదే స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని ఈ చిత్రంపై కొందరు కాపీ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.

holly-wood-movies

‘దేవదాస్‌’ చిత్రంను హాలీవుడ్‌ సినిమా ‘ఎనాలసిస్‌ దిస్‌’ కు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ హాలీవుడ్‌ సినిమాలో ఉన్న పాత్రల తరహాలోనే నాగ్‌ మరియు నానిల పాత్రలు ఉన్నాయి. బాడీలాంగ్వేజ్‌ నుండి పలు అంశాలు ఆ రెండు పాత్రలకు దగ్గరగా ఉన్నాయి అంటూ సోషల్‌ మీడియాలో రెండు సినిమాల వీడియోలను పక్క పక్కన పెట్టి మరీ కంపైర్‌ చేస్తున్నారు. ఇంత చెప్పినా, చేసినా కూడా దర్శకుడు మాత్రం తన సినిమాను కాపీ అంటే ఒప్పుకోను అంటున్నాడు. ఇది ప్రెష్‌ కథ అని, ఒరిజినల్‌గా రాసుకున్న కథ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ప్రెస్‌మీట్‌లో కూడా ఈ విషయమై ఆయన్ను మీడియా వారు ప్రశ్నించగా అందుకు సమాధానంగా కాపీ కానే కాదు అన్నాడు. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వివాదం ముగిసి పోతుంది. కాని ఫ్లాప్‌ అయితే మాత్రం కాపీ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి.

devadas-movie