నాగ్‌ సర్‌ తనపై పెద్ద అబాండం వేశాడు…!

Nagarjuna Sensational Comments On Nani

నాగార్జున తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అయిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున వైరల్‌ అయిన ఆ వీడియోలో నాని ఒక మొబైల్‌ పిచ్చొడు అని, ఎక్కువగా మొబైల్స్‌తోనే ఉంటాడు, పక్కన అమ్మాయి ఉన్నా కూడా మొబైల్స్‌లోనే ఉంటాడు అంటూ నాగార్జున కామెంట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవ్వడంతో పాటు, ఎంతో మంది నిజంగానే నాని మొబైల్‌ పిచ్చోడు అంటూ తమ అనుభవంను చెప్పుకొచ్చారు. తాజాగా ఆ విషయమై నాని స్పందించాడు.

nagarjuna-movies

‘దేవదాస్‌’ విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాని ఆ వైరల్‌ వీడియో గురించి స్పందించాడు. తాను అంతగా మొబైల్స్‌ వాడను అని, అయితే నాగార్జున గారి ముందు తాను ఎప్పుడు కూడా మొబైల్‌ వాడే ధైర్యం చేయలేదు. ప్రియాంక మరియు స్వప్నలు చెప్పడం వల్ల ఆయన ఇలా వీడియో తీసి ఉంటారు. మొత్తానికి నాపై పెద్ద అబాండం వేశారు అంటూ నాని ఆవేదనతో అన్నారు. నాగార్జున గారి వీడియోతో తాము కూడా అగ్రీ అంటూ ఎంతో మంది పోస్ట్‌ చేస్తున్నారు, అలా నన్ను మొబైల్‌కు బానిస అన్నట్లుగా చిత్రీకరించారు అంటూ నాని అన్నాడు.

nani