దేవదాస్‌లు 4 రోజుల్లో ఎంత రాబట్టారంటే..!

Devadas 4 days Box Office Collections

నాగార్జున, నానిల మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు రివ్యూవర్స్‌ నుండి కాస్త నెగటివ్‌ టాక్‌ వచ్చింది. మంచి రేటింగ్స్‌ రాకపోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే మొదటి నాలుగు రోజు కలెక్షన్స్‌ మాత్రం ఒక మోస్తరుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రం మరీ డిజాస్టర్‌ కాకుండా, మరీ హిట్‌ కాకుండా యావరేజ్‌గా ఉందని ఈ కలెక్షన్స్‌ను బట్టి అర్థం అవుతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంకు ఈ కలెక్షన్స్‌ తక్కువే అయినా కూడా నెగటివ్‌ రివ్యూలు వచ్చిన సినిమాకు ఇవి మంచి కలెక్షన్స్‌ అంటూ ట్రేడ్‌ నిపుణులు అంటున్నారు.

devadas-movie-nagarjuna

మొదటి నాలుగు రోజుల షేర్‌ :
నైజాం – 4.45 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.57 కోట్లు
సీడెడ్ – 1.75 కోట్లు
గుంటూరు – 1.13 కోట్లు
ఈస్ట్ – 84 లక్షలు
వెస్ట్ – 63 లక్షలు
కృష్ణ -92 లక్షలు
నెల్లూరు – 43 లక్షలు

ఎపీ+తెలంగాణ : రూ.11.72 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా : 2.15 కోట్లు
ఓవర్సీస్: 2.90 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 16.77 కోట్లు