మూడవ సీజన్‌కు నాని నో చెప్పాడా…?

Anil Ravipudi Movie Fix With Nani

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ముగిసింది. కౌశల్‌ విజేతగా నిలిచాడు. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌కు ఇక గుడ్‌బై అన్నట్లుగా నాని మాట్లాడటం జరిగింది. నాని చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి నాని హోస్ట్‌గా వ్యవహరించడా అంటూ చర్చ జరుగుతుంది. నాని రెండవ సీజన్‌కు హోస్ట్‌గా ఎంపిక అయిన సమయంలో వరుసగా మూడు సీజన్‌కు గాను నానితో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అది నిజం కాదని, ఎప్పుడు కూడా ఒక్కో సీజన్‌కు మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటారు అంటూ నిర్వాహకులు చెబుతున్నారు.

nani-bigboss

తాజాగా మూడవ సీజన్‌కు సంబంధించిన చర్చ ఇంకా మొదలే కాలేదు. మరో సంవత్సరం పాటు గ్యాప్‌ ఉండబోతుంది. అయినా అప్పుడే నాని హోస్ట్‌ కాదు అంటూ ఎలా అంటారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే నాని బిగ్‌బాస్‌ సీజన్‌ 2 లో ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాల నేపథ్యంలో ఖచ్చితంగా మూడవ సీజన్‌కు నో చెబుతాడు అంటూ చర్చ జరుగుతుంది. మూడవ సీజన్‌ కోసం నిర్వాహకులు కొత్త హోస్ట్‌ను వెదుక్కోవాల్సిందే అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంటున్నారు. కొత్త హోస్ట్‌తో మూడవ సీజన్‌ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మా వర్గాల వారు అంటున్నారు.

nani