దేవదాసుల బిజినెస్‌ అదిరింది!

Devadas Pre Release Business Collections 50 Crores

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం అన్ని ఏరియాలో కూడా మంచి రేటుకు అమ్ముడు పోయింది. తెలుగు ప్రేక్షకుల్లో మల్టీస్టారర్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. దానికి తోడు ఈ చిత్రంలో నాగార్జున మరియు నాని వంటి స్టార్‌లు నటించడం కారణంగా బయ్యర్లు ఈ చిత్రంపై చాలా ఆసక్తిని కనబర్చారు. అందుకే నిర్మాతకు ఈచిత్రంతో కాసుల వర్షం కురిసినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపుగా 50 కోట్ల మేరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

Nagarjuna Devadas Movie Release Get Soon

కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఈ చిత్రం ఏకంగా 37.5 కోట్ల మేరకు దక్కించుకుంది. నైజాం ఏరియాలో 11.5 కోట్లను రాబట్టగా, ఆంధ్రా ఏరియాకు గాను 15 కోట్లకు ఈ చిత్రం అమ్ముడు పోయిందట. ఇక ఓవర్సీస్‌లో కూడా దాదాపు 5 కోట్లకు గాను ఈ చిత్రంను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక శాటిలైట్‌ రైట్స్‌, డబ్బింగ్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇలా మిగిలిన రైట్స్‌ ద్వారా మరింత మొత్తం వచ్చే అవకాశం ఉంది. 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయిన ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వినీదత్‌ వైజయంతి మూవీస్‌లో నిర్మించిన విషయం తెల్సిందే.