విజయ్‌ దేవరకొండపై కొరటాల స్పెషల్‌ ఫోకస్‌…!

Koratala Siva Special Focus On Vijay Devarakonda

‘పెళ్లి చూపులు’ చిత్రంతో సినీ పరిశ్రమలో మంచి మార్క్‌ను సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతాగోవిందం’ చిత్రాలతో స్టార్‌గా మారిపోయాడు. ఈయన కోసం స్టార్‌ డైరెక్టర్స్‌ కూడా వేచి ఉంటున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘నోటా’ అక్టోబర్‌ 5 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా స్టార్‌ దర్శకుడు కొరటాల శివ ఒక కార్యక్రమంలో తాజాగా విజయ్‌పై తన ఇంట్రెస్ట్‌ను చెప్పుకొచ్చాడు.

kotatila-siva

‘పెళ్లి చూపులు’ చిత్రం చూడగానే విజయ్‌ కోసం ఒక స్క్రిప్టును తయారు చేయాలనుకున్నా కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు చూశాకా ఒక ప్రత్యేకమైక కథ రాయాలనుకుంటున్నా, త్వరలోనే విజయ్‌ దగ్గరకు ఒక ప్రత్యేకమైన స్క్రిప్టుతో వెళ్లాలని డిసైడ్‌ అయ్యాడంటా! అపజయం ఎరుగని స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కూడా విజయ్‌ కోసం స్పెషల్‌ ఫోకస్‌తో ఒక కథను తయారు చేస్తాను అని చెప్పడం చాలా ఆసక్తిగా మారింది. దీన్ని బట్టి చూస్తే ఇంకా చాలామంది డైరెక్టర్‌లు కూడా విజయ్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న ఇతర దర్శకులు కూడా విజయ్‌ని ఆకాశానికి ఎత్తేశారు. ఇదంతా చూస్తుంటే విజయకు త్వరలో స్టార్‌ దర్శకుల నుండి వరుస పిలుపులు రాబోతున్నట్టు తెలుస్తోంది.

vijay-movies