‘సాక్ష్యం’ బడ్జెట్‌ హద్దులు దాటింది!

bellamkonda srinivas sakshyam Budget details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మొదటి సినిమా నుండి కూడా భారీ చిత్రాలే చేస్తూ వస్తున్నాడు. మొదటి సినిమాకు వినాయక్‌ ఏకంగా 40 కోట్లు ఖర్చు చేశాడు. ఆ సినిమా సక్సెస్‌ అయినా కూడా బడ్జెట్‌ ఎక్కువ అవ్వడంతో రికవరీ చేయడంలో విఫలం అయ్యింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ హీరో చేసే ప్రతి సినిమా కూడా భారీ ఎత్తున బడ్జెట్‌తోనే తెరకెక్కుతంది. తాజాగా ఈయన చేస్తున్న ‘సాక్ష్యం’ చిత్రం కూడా బడ్జెట్‌ హద్దులు దాటింది. సాదారణంగా ఒక యువ హీరో సినిమా అంటే కేవలం 10 నుండి 20 కోట్ల మద్యలో బడ్జెట్‌ ఉంటుంది. కాని ‘సాక్ష్యం’ చిత్రానికి ఏకంగా 35 కోట్ల మేరకు ఇప్పటికే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

తన కొడుకును టాప్‌ హీరో చేయాలనే పట్టుదలతో ఉన్న నిర్మాత బెల్లంకొండ సురేష్‌ భారీ మొత్తాలతో సినిమాలను నిర్మిస్తున్నాడు. ‘సాక్ష్యం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీవాస్‌కు పెద్దగా క్రేజ్‌ లేదు. అయినా కూడా ఈయన దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఇంత బడ్జెట్‌ను పెట్టడం జరిగింది. ప్రమోషన్‌ మరియు ఇతరత్ర ఖర్చుతలో కలిపి మొత్తంగా 40 కోట్ల మేరకు బడ్జెట్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఈ హీరో ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా 40 కోట్ల బడ్జెట్‌ను రికవరీ చేయడం అనేది అసాధ్యం. ఒక వేళ సినిమా పొరపాటున ప్లాప్‌ అయితే కనీసం అయిదు కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోవచ్చు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌ను మరీ ఇంతగా పెట్టడంను కొందరు తప్పుబడుతున్నారు.