చిరుతోనే ఫైనల్‌… అవన్ని పుకార్లే

Koratala Siva Next movie with Chiranjeevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేర్లలో ముందు వరుసలో కొరటాల శివ పేరు ఉంటుంది. ఈయన చేసినవి నాలుగు సినిమాలే అయినా కూడా నెం.2 స్థానంను దక్కించుకున్నాడు. ఇటీవల ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. ఆ సినిమా టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది. భరత్‌ అనే నేను చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఏంటీ అంటూ గత కొన్నాళ్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొన్నాళ్లు అఖిల్‌తో సినిమా అన్నారు, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నానితో సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయితే కొరటాల ఇప్పటికి క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమా విషయమై మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. తాను చేస్తున్న సినిమాపై సంచలన ప్రకటన చేశాడు.

కొరటాల శివ తర్వాత సినిమా చిరంజీవితో ఉండబోతుంది. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వడానికి కనీసం ఆరు నెలల సమయం అయినా పట్టవచ్చు. అయినా కూడా చిరంజీవితోనే సినిమా చేయాలని అంత కాలం వెయిట్‌ చేసేందుకు కొరటాల శివ సిద్దం అయ్యాడు. ఈ గ్యాప్‌లో చిరంజీవి కోసం పక్కా కమర్షియల్‌ మాస్‌ కథను సిద్దం చేస్తానంటూ ప్రకటించాడు. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే జనవరిలో సినిమాను పట్టాలెక్కించేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవి దాదాపు ఆరు నెలల సమయంను కొరటాలకు కేటాయించినట్లుగా తెలుస్తోంది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటే ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాను కొరటాల తీయగలడా అనేది చూడాలి.