‘అరవింద సమేత’ ప్రివ్యూ…!

Aravinda Sametha Preview

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ దశాబ్ద కాలం నుండి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంభినేషన్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి ఈ ఇద్దరి కాంభోలో ‘అరవింద సమేత’ తెరకెక్కి దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. ఈ చిత్రంపై కేవలం ఎన్టీఆర్‌ అభిమానులకే కాకుండా సినీ వర్గాల వారికి కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించబోతున్నాడు.

Jr NTR Aravinda Sametha Gets U/A Certificate
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 93కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. అంతేకాకుండా 100కోట్ల షేర్‌ను కూడా సొంతం చేసుకుంటుంది అని చిత్ర యూనిట్‌ ధీమాగా ఉన్నారు.  రెండు అదనపు షోలు ప్రదర్శించడానికి ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు వచ్చాయి. అంతేకాకుండా టికెట్టు ధరలను కూడా పెంచడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో అరవిందుడికి అన్ని విధాల కలిసి వస్తోంది. ఎన్టీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అవడంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే ఫలితం ఎలా ఉండబోతుంది అనేది రేపటితో తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే రొమాన్స్‌ చేసింది.

Aravinda Sametha Pre Release Business