తిరుపతిలో ప్లాన్‌ చేసిన ‘ఎన్టీఆర్‌’

NTR Biopic PRe Release Event

బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. రెండు పార్ట్‌లుగా విడుదలకాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. ఈ సమయంలోనే మొదటి పార్ట్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాంతం అయిన తిరుపతిలో ‘ఎన్టీఆర్‌ కథానాయుడు’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో ప్రత్యేక గెస్ట్‌గా హాజరు కాబోతున్నాడు. ఎన్టీఆర్‌ చిత్రంలో నటించే నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఎంతో మంది ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనబోతున్నారు.

Savitri First Look At NTR Biopic

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. ఇక ఎన్టీఆర్‌ మహానాయుడు చిత్రం కూడా షూటింగ్‌ చకచక జరుగుతోంది. రిపబ్లిక్‌ డే సందర్బంగా ఆ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. రెండు సినిమాలకు కూడా రెండు వారాలు మాత్రమే గ్యాప్‌ ఉండబోతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

NTR-And-ANR-look-in-ntr-bio