రైల్వే క్లర్క్ గా సమంత – మజిలీ సినిమా కూడా పీరియాడిక్ డ్రామానా…?

naga chaitanya and samantha in simhachalam

మజిలీ అనే ఒక అందమైన పేరు ని తమ సినిమా టైటిల్ గా పెట్టుకొని, శివ నిర్వాణ దర్శకత్వంలో భార్యాభర్తలైన నాగ చైతన్య మరియు సమంత లు కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర జరుపుకుంటుంది. ఈ సినిమా షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి, ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఈ లీకైన ఫోటోలను గమనిస్తే, గుబురు గడ్డం తో ఉన్న నాగ చైతన్య, సమంత ని తన బండి మీద కూర్చోబెట్టుకొని, సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర దింపి, అక్కడే ఉన్న చెట్టు క్రింద బైక్ పార్క్ చేసి సిగరెట్ వెలిగిస్తుంటాడు. సమంత అదే రైల్వే స్టేషన్ లో క్లర్క్ గా టిక్కెట్లను ఇస్తుంటుంది. కానీ, ఈ సెటప్ అంత చూస్తుంటే, ఈ సినిమా పీరియాడిక్ డ్రామా గా అనిపిస్తుంది.

Samantha Chaithanya Cinema

ఇప్పటికే లీకైన ఒక వీడియో ని గమనిస్తే, ఒక పాత ఇల్లు, పాత టీవీ, పాత సామాన్లు, సమంత లుక్స్ ఇవన్నీ మనం 90 వ దశకంలోని సినిమాని చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది.నిన్ను కోరి సినిమాతో మంచి హిట్ తో డైరెక్టర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన శివ నిర్వాణ తన రెండో సినిమాలో రియల్ లైఫ్ భార్యాభర్తలైన నాగ చైతన్య, సమంత లను రీల్ లైఫ్ భార్యాభర్తలుగా చూపిస్తున్నాడు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హిందీ సీరియల్ నటి దివ్యంకా కౌశిక్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది. గోపి సుందర్ మరోమారు శివ నిర్వాణ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నాగ చైతన్య ఇటీవల నటించిన శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచిన నేపథ్యంలో మజిలీ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.