‘సైరా’లో అల్లు అర్జున్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఏంటో…?

Sye Raa Narasimha Reddy Teaser Release Soon

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటున్నాయి. డిసెంబర్‌ వరకు సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో దర్శకుడు సురేందర్‌ రెడ్డి రాత్రింబవల్లు కష్టపడుతున్నాడు. డిసెంబర్‌లో కాకున్నా జనవరి రెండవ వారం వరకు అయినా పూర్తి చేసే అవకాశాలున్నాయని సినీవర్గాల వారు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబ, సుదీప్‌ ఇంకా పలువురు స్టార్స్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. వారందరితో పాటు ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ కూడా ఉండబోతున్నాడట. అయితే అల్లు అర్జున్‌ ఈ చిత్రంలో కనిపించకుండా కేవలం వినిపిస్తాడట. ఈ విషయంపై దాదాపుగా ఒక స్పష్టత వచ్చేసింది.

syee-chiru

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రంను వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ వాయిస్‌ ఓవర్‌ మరెవ్వరిదో కాదు అల్లు అర్జున్‌దట. అవును అల్లు అర్జున్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించేందుకు చిరంజీవి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడటంటూ మీడియా ద్వారా సమాచారం అందుతోంది. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో ప్రస్తుతం చిరంజీవి పాల్గొంటున్నాడు. త్వరలోనే సినిమా నుండి టీజర్‌ను వదలబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

nayanthara in sye raa dates not confirmed