ఎన్టీఆర్ సెట్ లో మోక్షజ్ఞ.. పనేంటో?

బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో రుపొందుతున్నా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ చిత్రం షూటింగ్ స్పాట్ కి సడన్ ఎంట్రీ ఇచ్చాడు మోక్షజ్ఞ రాకతో షూటింగ్ స్పాట్ మొత్తం ఎంతో సందడి నెలకొన్నది. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కు మోక్షజ్ఞ రావడం ఇదే మొదటిసారి. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేకమైన షూటింగ్ సెట్ ను వేశారు. దీనిని చూడటానికి వచ్చాడు అని కొందరు అంటున్నారు మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఓ క్యారక్టర్ లో నటించడానికి వచ్చాడు అంటున్నారు.

ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుంది అని నందమూరి అభిమానుల్లో మాత్రం ఆనందం నెలకొన్నది. గతంలో కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ నటిస్తాడు అన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవ్వుతాడు అంటున్నారు. ఈ విషయాన్నీ బాలకృష్ణ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే తెలుగు తెరకు ఓ ప్రముఖ డైరక్టర్ ద్వారా పరిచయం ఉంటుందని ఓ సందర్బంలో బాలకృష్ణ చెప్పాడు. ఇప్పుడు మోక్షజ్ఞ ను చూస్తే అది మరి ఇంకెంతో దూరంలో లేదు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ మూవీని నందమూరి బాలకృష్ణ యన్బికే ప్రొడక్షన్స్ పైన నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాని వచ్చే ఏడాది జనవరి 11 న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు.