చరణ్ మూవీ కోసం జకన్న, ఎన్టీఆర్?

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి కొంత గ్యాప్ తీసుకున్నా చరణ్, ప్రస్తతం వినయ విధేయ రామ సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను ఈ చిత్రాని ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, అండ్ టిజర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. రీసెంట్ గా విడుదలైన లిరికల్ సాంగ్ కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇప్పుడు ఈ చిత్రం నుండి ఓ లేటెస్ట్ అప్డేట్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. అదే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాజమౌళి, ఎన్టీఆర్ లు వస్తున్నారు. ఈ వార్తకు బలం చేకుర్స్తూ. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి, బోయపాటి వినయ విధేయ రామ చిత్రానికి ప్రొడ్యూసర్ ఒక్కరే డివివి దానయ్య కావడంతో వచ్చే అవకశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ మినహా సినిమా పూర్తయి ప్రమోషన్స్ కు వెళ్ళింది ఈ చిత్రాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న విదుదల కానున్నది.